వేములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన పరశురాములు

ప్రజాలహరి వేములపల్లి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్వే నిర్వహించారు అనంతరం పరశురాములు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణీలకు రక్తహీనత నివారించేందుకు అవసరమైన ఐరన్ ఇంజక్షన్లు కొంతకాలంగా లేకపోవడం బాధాకరమని, ఆసుపత్రిలో రోగులకు అవసరమైన పూర్తిస్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని మరియు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కోరారు ఆసుపత్రిలోని వార్డుల్లో పూర్తిస్థాయి పరిశుభ్రత ఉండేలా చూసి రోగులకు అసౌకర్యం లేకుండా చూడాలని ఆసుపత్రి స్లాబు పేక్షులు కూడిపడే పరిస్థితిలో బిల్డింగ్ ఉందని వాటికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పెంటమల్ల సుకన్య లింగమ్మ సైదులు తదితరులు పాల్గొన్నారు

You May Have Missed