సర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలి ఆర్డిఓ రమణారెడ్డి

ప్రజాలహరి వేములపల్లి

SIR ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆర్డీవో రమణారెడ్డి సిబ్బందికి సూచించారు బుధవారం మండలంలోని మొలకపట్నం గ్రామంలో పోలింగ్ బూత్ 29 30 శెట్టిపాలెం గ్రామంలో సరు ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఆయన తహసీల్దార్ హేమలతతో కలిసి పరిశీలించారు బిఎల్వోలు ఇంటింటికి అందించిన ఫారాలను ఓటర్లు సమగ్రంగా నింపేలా చూడాలన్నారు ఓటర్లు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వాటిని నివృద్ది చేసి తప్పులు లేకుండా ఫారాలను నింపేలా చూడాల్సిన బాధ్యత బిఎల్ఓ లపై ఉందన్నారు పూర్తి స్థాయిలో నింపిన ఫారాలను సేకరించి ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుణ ఎంతో కీలకమైనందున అర్హత గల అందరిని జాబితాలో ఉండేలా చూడాలన్నారు గ్రామాల్లోని బూత్ స్థాయి అధికారులు కార్యకర్తలు సహకరించి సకాలంలో సర్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ మహేందర్రెడ్డి బిఎల్వోలు రజిత విమల సిబ్బంది తహసీన్ తదితరులు పాల్గొన్నారు

You May Have Missed