మాతృ వియోగంతో బాధలో ఉన్న ఎండి. మోషిన్ అలీ కుటుంబాన్ని పరామర్శించిన నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి, నల్లమోతు సిద్ధార్థ
ప్రజాలహరి వేములపల్లి;మాడ్గులపల్లి మండలం అగామోత్కూర్ గ్రామానికి చెందిన నల్లగొండ జిల్లా మాజీ జెడ్పీ కో-ఆప్షన్ మెంబర్ ఎండి. మోషిన్ అలీ మాతృమూర్తి మరణవార్త తెలిసి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా దివంగత ఆత్మకు ఘనంగా నివాళులర్పించి, మోషిన్ అలీ తో పాటు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో AMC మాజీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య,బారాస రాష్ట్ర నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి, రైబస మండల అధ్యక్షులు మిర్యాల మధుసూదన్ రావు, PACS మాజీ చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్, పట్టణ కౌన్సిలర్ గంగుల బిక్షం యాదవ్, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.



