భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆరో తేదీ నుంచి ప్రజా చైతన్య యాత్రలు సీపీఐ బంటు
ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజు స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గ సమితి సమావేశం జిల్లా యాదగిరి అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్య పరుస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు నల్లగొండ జిల్లా అన్ని మండలాల్లోనూ ప్రజా చైతన్య యాత్రలు చేపడుతున్నట్లుగా వారన్నారు బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆర్థిక విధానాలు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదల యువతకు నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకనులను చేస్తూ రైతుల ఎరువుల పెరుగుదల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీటిని వారికి అవగాహన కల్పిస్తూ భవిష్యత్తులో ప్రభుత్వాలపై ప్రజా పోరాటాలు చేసేందుకు ప్రజలను చైతన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారని వారన్నారు సమావేశంలో మండల కార్యదర్శి లు అంజనపల్లి రామలింగం పోలేపల్లి ఉదయ్ కుమార్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బిల్లా కనకయ్య మండల సమితి సభ్యులు గోగుల యాదగిరి ప్రజానాట్యమండలి నాయకులు వెన్నెల వెంకన్న మహిళా సమైక్య నాయకురాలు దాసర్ల దుర్గమ్మ ధనావత్ శాంతి ఎస్కే షమీం మండల సమితి సభ్యులు గువ్వల మట్టయ్య బస్కర్ల పరమేష్ ఏఐవైఎఫ్ నాయకులు లోకేష్



