శిరస్సు నాగయ్యను పరామర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ
శిరస్సు నాగయ్యను పరామర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ
ప్రజాలహరి వేములపల్లి;మాడ్గులపల్లి మండలం భీమనపల్లి చర్లగూడెం గ్రామానికి చెందిన శిరస్సు నాగయ్య ఇటీవల హార్ట్ ఎటాక్ (గుండెపోటు)కు గురయ్యారు. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొంది, కోలుకుని స్వగ్రామమైన చర్లగూడెం చేరుకున్న నాగయ్యను బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ, నాగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యాన్ని చెప్పారు. ఆయన త్వరగా కోలుకుని పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
హాజరైన నాయకులు: ఈ కార్యక్రమంలో పాలూట్ల బాబయ్య మారుతి వెంకట్ రెడ్డి మహేష్ రామదాసు సైదులు. ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు..



