రాష్ట్రంలో మార్పు రావాలి కాంగ్రెస్ పోవాలి మా విద్యార్థుల స్కాలర్షిప్ రావాలి .SFIడిమాండ్

రాష్ట్రంలో మార్పు రావాలి కాంగ్రెస్ పోవాలి మా విద్యార్థుల స్కాలర్షిప్ రావాలి .SFIడిమాండ్

 

ప్రజాలహరి మిర్యాలగూడ ;స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేంతవరకు పోరాడుతాం. SFIజిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్  మిర్యాలగూడ. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాఘవ టాకీస్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు1500మంది విద్యార్థులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మం పాటి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్య తరగతి విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని అన్నారు. రాష్ట్రంలో 10 500 కోట్లు బకాయిలు ఉంటే గత ప్రభుత్వం పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప బకాయిలో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలో విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోర్టు పదేపదే చెబుతున్న ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్టున్నది తప్ప స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఆలోచించకుండా ప్రభుత్వానికి చల్లనం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని విద్యార్థులు అందరితో కలిసి ఆగస్టు 6న హైదరాబాద్లో జరిగే మహాధర్నా తో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాకుంటే దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ కు పట్టిన గతి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పడుతుందని విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బతికిబట్ట కట్టలేదన్న చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి పోవద్దని అది కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం అవుతుందని అన్నారు. ఒక పక్క విద్యార్థులు ఉన్నత చదువులకు పోవాలంటే స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి సర్టిఫికెట్ లు ఇవ్వమని విద్యార్థులను ఇబ్బంది పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పోదుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు మూడవత్ రవి నాయక్,మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షా కార్యదర్శూలు మూడవత్ జగన్ నాయక్ కుర్ర సైదా నాయక్ , దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్,లోహి, ఝాన్సీ,బన్ని, హనుమంతు పవన్, బిస్మిల్లా,తరుణ్, సిపాయి,కల్పన, రాధిక, కళ్యాణి, స్పందన, శీరీష, కావ్య, అంజలి,మానసా, తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed