SIR ప్రక్రియలో చివరి మూడు రోజులు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మరింత బాధ్యతతో పనిచేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR 

SIR ప్రక్రియలో చివరి మూడు రోజులు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మరింత బాధ్యతతో పనిచేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

ప్రజాలహరి మిర్యాలగూడ ;ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLA)లతో సమీక్ష సమావేశం నిర్వహించారు…   ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా.. ప్రభుత్వం విప్, ఎమ్మెల్సీ,  నల్గొండ పార్లమెంట్ SIR ఇన్‌చార్జి బల్మూరి వెంకట్ , మరియు కె. శ్రీనివాస్ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య. మిర్యాలగూడ నియోజకవర్గ SIR ఇన్‌చార్జి షబ్బీర్ అలీ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, BLAలు తదితరులు పాల్గొన్నారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ SIR ప్రక్రియకు నిర్దేశించిన గడువు ఆగస్టు 3తో ముగియనున్న నేపథ్యంలో మిగిలిన మూడు రోజులు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేసి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు… తెలంగాణ రాష్ట్రంలో SIR ప్రక్రియపై అత్యధిక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న ఏకైక ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారేనని వారు పేర్కొన్నారు…  SIR ప్రక్రియను విజయవంతం చేయడంలో ఎమ్మెల్యే నిరంతర పర్యవేక్షణ, నాయకులకు దిశానిర్దేశం కీలకంగా నిలుస్తోందని అభినందించారు… మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి నివసిస్తున్న ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, ఇప్పటికే SIR ప్రక్రియలో 86 శాతం నమోదు పూర్తి చేసి జిల్లాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నామని తెలిపారు… మిగిలిన అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి, గడువు ముగిసేలోపు వంద శాతం ప్రక్రియ పూర్తి చేసే దిశగా అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు… ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఇంచార్జులు, BLA లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Previous post

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

Next post

సినీ నటుడు సోనుసూద్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో జనయేత్రి ఫౌండేషన్పండ్ల పంపిణీ జననేత్రీ

You May Have Missed