విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్‌లోని ఎంజేపీటీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ను ఈరోజు ఉదయం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLRమండల విద్యాశాఖ అధికారి (MEO)తో కలిసి సందర్శించారు… ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మౌలిక వసతులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రతను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు…అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి టీచర్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు… పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు, విద్యా బోధన, సిబ్బంది సమస్యలు, ఇతర అవసరాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు…
తదుపరి విద్యార్థులతో ముఖాముఖి సమావేశమై వారి విద్యాభ్యాసం, హాస్టల్ వసతులు, ఆహారం, తాగునీరు, పరిశుభ్రత, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకుని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు…
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేపడుతోందని అన్నారు… విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతిరోజూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన ఉదయం అసెంబ్లీలో విద్యార్థులతో కలిసి పాల్గొని వారికి విద్య యొక్క ప్రాముఖ్యత, క్రమశిక్షణ, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు… అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న యూనిఫామ్‌లను విద్యార్థులకు పంపిణీ చేసి, ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు… ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు..



