ఆనందోత్సాహాల నడుమ మిర్యాలగూడలో గురు పౌర్ణమి వేడుక

ప్రజాలహరి మిర్యాలగూడ;(హరిప్రసాద్ చీదెళ్ళ)

మిర్యాలగూడలో గురు పౌర్ణమి మహోత్సవం అద్భుతం అపూర్వం

భక్తజన సందోహం నడుమ గురు పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని శిరిడి సాయి ని వివిధ రకాలైన వాహనాలపై పట్టణ పురవీధులలో ఊరేగింపుగా మేళ తాళాలతో తీసుకువెళ్తూ భక్తులకు విశేషమైన దర్శనాన్ని కలిగించారు భక్తులు భక్తి శ్రద్ధలతో సాయిని దర్శించుకుని తరించారు ఊరేగింపులో భాగంగా మిర్యాలగూడ లోని హనుమాన్ పేట సాయి దేవాలయం మరియు రైల్వే స్టేషన్ సమీపంలో గల నాగ దత్తసాయి మందిరం లకు సంబంధించిన సాయి విగ్రహాలు కొలువైన రథాలను దేదీప్యమైన విద్యుత్ కాంతులతో పట్టణ వీధులలో ఊరేగింపుగా పయనించడం విశేషం పట్టణ ప్రజలు వేలాదిగా తరలివచ్చి వేడుకను చూసి సాయి దీవెనలను అందుకున్నారు కార్యక్రమంలో దేవాలయాల నిర్వాహకులు భక్తులు పుర ప్రముఖులు పాల్గొని శోభాయాత్రను పట్టణ పోలీసుల సహకారంతో విజయవంతం చేశారు

You May Have Missed