హాలియాలో అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి ఉత్సవాలు
ప్రజాలహరి హాలియా; ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా హాలియా మున్సిపాలిటీలోని శ్రీ సాయిబాబా క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి-దీప్తి స్వామివారి దర్శనం అనంతరం చైర్మన్ మాట్లాడుతూ హాలియా మున్సిపాలిటీ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. అనంతరం ఆలయ ధర్మకర్తలు చైర్మన్ గారి కుటుంబ సమేతంగా సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో .కౌన్సిలర్లు చిట్టిపోలు శ్రీదేవి కరుణాసాగర్, బొంగరాల యేసు రాజు, చెరుపల్లి ముత్యాలు, కౌన్సిలర్ సలహాదారులు ఎడవెల్లి రంజిత్, మరియు ఆలయ ధర్మకర్తలు , పుర ప్రముఖులు పాల్గొన్నారు.



