సినారె 95వ జయంతి కార్యక్రమం

*సినారె కలానికున్న ప్రత్యేకత శబ్దశక్తి అర్థ యుక్తి*

ప్రజాలహరి మిర్యాలగూడ;గురు పరంపరకు ఆద్యులు వ్యాసభగవానుడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జప్తి వీరప్ప గూడెం మిర్యాలగూడ మండలం నందు ప్రముఖ కవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె)గారి 95వ జయంతి కార్యక్రమం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు గుడిపాటి కోటయ్య మాట్లాడుతూ సినారే తన రచనల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషిచేశారు అని అలాగే ఇప్పటి యువకులకు యువ సాహితీవేత్తలకు వారు రాసిన ఆధునికాంధ్ర కవిత్వం సాంప్రదాయాలు ప్రయోగాలు అన్న సిద్ధాంత గ్రంథం నేటికీ ప్రామాణికంగా ఉండటమే వారి యొక్క ప్రతిభకు నిదర్శనమని, వారి రచనల్లో శబ్దశక్తి, అర్థయుక్తి ఎంతోమంది ని ఆకర్షించిందని,   సినీ వినీలాకాశంలో నిలిచిన అభినవ అక్షర కర్ణుడుగా  “నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని దగ్గర నుండి నేటి అరుంధతి సినిమాలోని జేజమ్మ”””పాట వరకు ఎన్నో వందల పాటలను అందించి సినీ కవిగా కీర్తి గడించారని, ప్రపంచ సాహిత్య సమ్మేళనంలో తెలుగు భాష ప్రతినిధిగా పాల్పంచుకున్నారని  “”పల్లెపరిమలం నింపుకొని మట్టిని ముద్దాడిన తెలంగాణ తేజం”” కనుక వారి సాహిత్య కృషిని నేటి తరం కొనసాగించవలసిన ఆవశ్యకత ఉన్నదని అందుకే నేటి యువకులు, సాహితివేత్తలు వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గురు(వ్యాస) పూర్ణిమ సందర్భంగా అఖిల విద్యా గురుడుగా పేరుగాంచిన వ్యాస మహర్షి యొక్క చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతీయ సాంప్రదాయంలో గురు పరంపరకు, ఆధ్యాత్మికతకు, వేద విభజనకు కారకుడై అఖిల విద్యా గురుడుగా పేరుగాంచిన వేద వ్యాసుని యొక్క పరంపరను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎడవల్లి దామోదర్ రెడ్డి, పి జగదీశ్వర్ రెడ్డి, ఒట్టె మాధవి, టి శ్రీనివాసరెడ్డి, జల్ రామ్, చంద్రకళ,రేణుక విద్యార్థులు పాల్గొన్నారు

Previous post

మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్ లో ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ మువ్వా రామారావు,డాక్టర్ జీవనజ్యోతి…..ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ థియేటర్ ను ప్రజల చెంతకు తీసుకువచ్చిన డాక్టర్ నువ్వా రామారావు…..

Next post

హాలియాలో అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి ఉత్సవాలు

You May Have Missed