నవంబర్లో జరగబోయే రైతు మహాసభలను జయప్రదం చేయండి
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ); రైతాంగాని కి గిట్టుబాటు ధర కల్పించాలి. రైతు సమస్యలపై పోరాటాలకు శ్రీకారం చుట్టనున్న జాతీయ మహాసభలు అన్నారం గ్రామంలో రైతులతో జూలకంటి నవంబర్ మాసంలో మొట్టమొదటిసారిగా నల్గొండ కేంద్రంలో జాతీయ రైతు మహాసభలు జరగనున్నాయని దానికి రైతాంగం ఆర్థిక హార్దిక సహాయాలను అందజేయాలని సభలు విజయవంతం చేయాలని రైతు సంఘం జాతీయ నాయకులు మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం నాడు మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామంలో పొలాల్లో నాట్లు వేస్తున్న రైతాంగం దగ్గరికి వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలోని రైతాంగాన్ని కలిసి మహాసభలకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు గాలాలు కష్టించి పని చేసిన రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనాయిని ఆయన అన్నారు. ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి రైతును రాజు చేస్తామని ప్రకటనలు చేయడం తప్ప వారికి చేసింది శూన్యమని అన్నారు. రుణమాఫీ చేస్తామని బూర్జవ పార్టీలు ఉపన్యాసాలతో ప్రజలను ఆకట్టుకుని అధికారం వచ్చిన తర్వాత దాని గురించి ప్రస్తావన చేయకుండా వాగ్దానాలను విస్మరిస్తారని విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తామని మాట ఇచ్చి దాన్ని అమల్లో అనేక సందేహాలను వెలిబుచ్చుతూ మాట తప్పే ఆలోచన చేస్తున్నారని దీన్ని చూస్తూ రైతాంగం సహించబోదని వారు హెచ్చరించారు. రైతు లేనిది అభివృద్ధి జరగదని వారిని బుజ్జగిస్తున్నారు తప్ప వారికి పెన్షన్ గాని భరోసా సౌకర్యాలు కానీ కల్పించకపోవడం శోచనీయమన్నారు. రైతుల ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యలపై జాతీయ స్థాయిలో జరిగే మహాసభలో చర్చించి పలు తీర్మానాలు చేసి సమర షీలా పోరాటాలకు సమాయత్తం చేయనున్నట్టు వారు తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన నలగొండ జిల్లాలో మహాసభలు జరపాలని ఆలోచన జాతీయ రైతు సంఘం చేసిందని వారు తెలిపారు.మొట్ట మొదటిసారిగా నల్గొండలో జాతీయ మహాసభల సందర్భంగా రైతులు తమకు తోచిన విధంగా సహకరించి మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డబ్బీకార్ మల్లేష్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీ సభ్యులు మంగారెడ్డి మండల కార్యదర్శి రవి నాయక్
నాయకులు అప్పారావు కాగా అన్నారం గ్రామంలో కాంతారెడ్డి ఉమాకాంత్ రెడ్డి వెంకట్ రెడ్డి కోటిరెడ్డి బెనర్జీ కన్యా నాయక్ రైతులు మహాసభల జయప్ర దానికి సహకరించాలన్నారు.



