మండల వ్యవసాయ అధికారి ఎం ఋష్యేంద్రమణి ఆధ్వర్యంలో విత్తనమేళా

ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ);ఈరోజు మిర్యాలగూడ రైతు వేదికలో “విత్తన మేళా (Seed Mela)” నిర్వహించబడినది. ప్రస్తుత ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షపాతం అనిశ్చితంగా ఉండటంతో రైతులు వరి సాగుపై సందిగ్ధంలో ఉన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, తక్కువ నీటి అవసరమున్న పప్పుధాన్య పంటల విత్తనాలు ప్రదర్శన చేయడం జరిగినది కంది, పెసర, మినుము, ఉలవలు, అలసంద, కూరగాయల విత్తనాలు తదితర పప్పుధాన్యాల విత్తనాలతో పాటు రైతులు కోరే ఇతర పంటల విత్తనాలను కూడా తగినంత పరిమాణంలో అందుబాటులో ఉంచాము , రైతులు రైతు వేదికలో విక్రయించవలెను.
రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచి, విత్తన మేళా ఏర్పాటు చేసాము . ఈ కార్యక్రమములో సహాయ వ్యవసాయ సంచాలకులు కొనిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు , మండల వ్యవసాయ అధికారి యం రుషేంద్రమని గారు , వ్యవసాయ విస్తరణ అధికారులు లు అఫ్రిన్,రమేష్, నాగయ్య, పార్వతి, dm markfed ch.కృష్ణవేణి, జానీ, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

You May Have Missed