నూతన కాంగ్రెస్ కమిటీ పట్టణ, మండల అధ్యక్షులను సన్మానించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

నూతన కాంగ్రెస్ కమిటీ పట్టణ, మండల అధ్యక్షులను సన్మానించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

ప్రజాలహరి మిర్యాలగూడ;(హరిప్రసాద్ చీదళ్ళ)మిర్యాలగూడ నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండలాల కమిటీల అధ్యక్షులకు    కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రాజీవ్ భవన్) లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు… ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ మోయిజ్ గారు, కోడిరెక్క ఇంద్ర కుమార్ మిర్యాలగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుండు నరేందర్ వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రెగంటి రవీందర్ రెడ్డి దామరచర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొర్ర నాగునాయక్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు   రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ . తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్యులు    శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంచార్జ్ మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ . పెద్దలు శ్రీ కుందూర్ జానారెడ్డి నల్గొండ పార్లమెంట్ సభ్యులు శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి . MLC శ్రీ శంకర్ నాయక్ . డీసీసీ అధ్యక్షులు శ్రీ పున్నా కైలాష్ నేత ఆశీర్వాధాలతో వారి ఆదేశాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని సూచించారు.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలపర్చాలని నూతన అధ్యక్షులకు పిలుపునిచ్చారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

You May Have Missed