సామెగాని తండాలో తీజ్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలుగూడ మండలం సామేగాని తండా గ్రామంలో ఘనంగా నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని గిరిజన మహిళలకు, గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువతతో ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలతో అనుబంధమే తనకు అతిపెద్ద బలం అని పేర్కొన్నారు. గిరిజన సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే తీజ్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, మాజీ సర్పంచ్ ధనావత్ సైదా నాయక్, కురువ నాయక్ ,సురేష్, రమేష్ ,బాల, బాలు ,రవి నాయక్ , యువకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో* పాల్గొన్నారు.

You May Have Missed