ఈనెల పదో తేదీన నాగార్జునసాగర్ లో వరుణయాగం
మిర్యాలగూడ ప్రజలహరి… రైతులు ప్రజలు స సుఖ సంతోషాలతో ఉండాలని అనే మహా సంకల్పం తో ఈనెల 10వ తేదీన నాగార్జునసాగర్ లో యాదాద్రి వేద పండితులు చేత వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు నల్గొండ జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
దేశం మరియు రాష్ట్ర ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు సంపూర్ణంగా నిండాలని, ఎల్‌నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై లేకుండా ఉండాలని, ఆకాంక్ష తో వరుణ యాగం నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్ఎ. రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకుయాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (వైటిడి) అర్చక, సిద్ధాంతులు ఆగస్టు 10 వ తేదీన వరుణ యగానికిమూహూర్తం గా నిర్ణయించారు.
యాదగిరిగుట్ట దేవస్థాన ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదపండితులు మరియు అర్చక బృందం సమక్షంలో మహా వరుణయాగం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుచున్నది.
ఈ పవిత్ర మహాయాగం కృష్ణానది తీరాన వెలసిన నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున, విజయవిహార్ ఆవరణ లో నిర్వహించబడుతుంది.
ఈ మహాయాగంలో సాయంత్రం 3.24 గంటలకు జరిగే పూర్ణాహుతి మహోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కూడా విచ్చేసి పాల్గొననున్నారు.
కావున, ప్రకృతి అనుగ్రహం, సమృద్ధిగా వర్షాలు, కృష్ణా–గోదావరి నదుల జలసంపద పరిపుష్టి, రైతాంగ సంక్షేమం, రాష్ట్ర సుభిక్షం కోసం నిర్వహించబడుతున్న ఈ మహోన్నత వరుణయాగ మహాకార్యక్రమానికి మీరు విచ్చేసి, యాగంలో పాల్గొని, శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య ఆశీర్వచనాలను పొంది, ఈ పుణ్యకార్యాన్ని విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.



