మిర్యాలగూడ బై పాస్ పై ఫ్లై ఓవర్ నిర్మించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం
మిర్యాలగూడ బై పాస్ పై ఫ్లై ఓవర్ నిర్మించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ పట్టణంలో బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించి ప్రమాదాలను నివారించి ప్రజల ప్రణాలకు రక్షణ కల్పించాలని ఈరోజు మిర్యాలగూడకు వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి గిరిజన సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల పరిధి లో మూడోసారి యాక్సిడెంట్ జరిగి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఫ్లైఓవర్ నిర్మించేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. అదేవిధంగా మరో చోటైన చిల్లాపురం రోడ్డు క్రాసింగ్ వద్ద అండర్పాస్ నిర్మించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు చిట్టిబాబు నాయక్,రవి నాయక్,బాబు నాయక్,వెంకటేశ్వర నాయక్,భాస్కర్ నాయక్,శ్రీను నాయక్, , తదితరులు పాల్గొన్నారు



