బీసీ ల హక్కుల పరిరక్షణ కు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి

 ప్రజాలహరి మిర్యాలగూడ;బీసీ ల హక్కుల పరిరక్షణ కు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలనీ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్,గుడిపాటి కోటయ్య, బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు అన్నారు.బుధవారం మిర్యాలగూడ లో ఈనెల 9న నల్గొండ లో జరుగన్న బీసీ ల న్యాయ పోరాట సభ.పోస్టర్ కరపత్రం ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం దాదాపు బీసీ ల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని, బీసీ ఉద్యోగుల కు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని,జాతీయ కుల గణన లో ప్రతి కులానికి ఒక యూనిక్ నెంబర్ కేటాయించాలని.తదితర డిమాండ్ ల తో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో గుడిపాటి కోటయ్య మెండె వెంకట్ మాలి సైదులు అంబటి శ్రీను గోశిక దయాకర్ బంటు నాగేందర్ పసుల కాశి యాదవ్ అనంతుల అంజయ్య జెల్లా సత్యనారాయణ రాములు గౌడ్ పున్న రాములు తోట వెంకటేశ్వర్లు, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Previous post

మాస్టారు”….మీరే మా “స్టారు”…సమాజ సేవలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు షరీఫ్ సమాజసేవలో స్పూర్తి ఉపాధ్యాయులు షరిఫ్

Next post

మిర్యాలగూడ బై పాస్ పై ఫ్లై ఓవర్ నిర్మించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం

You May Have Missed