మిర్యాలగూడ మండలంలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు – ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన

మిర్యాలగూడ మండలంలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు – ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన

 

మిర్యాలగూడ: జిల్లా వ్యవసాయ అధికారి వళ్ళోజు వినోద్ కుమార్ గారు

ప్రజాలహరి మిర్యాలగూడ;వ్యవసాయ సహాయ సంచాలకులు కొనిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ మండలంలోని ఎన్‌డీసీఎంఎస్ (NDCMS) మిర్యాలగూడ మరియు కేకే ట్రేడర్స్ ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.    ఈ సందర్భంగా అధికారులు స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, ఈ-పాస్ (e-POS) యంత్రాల ద్వారా జరిగిన అమ్మకాల రికార్డులు, గోదాముల్లోని ఎరువుల నిల్వలు, కొనుగోలు–అమ్మకాల వివరాలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయిస్తున్నారా, ఆధార్ ఆధారిత ఈ-పాస్ యంత్రం ద్వారానే రైతులకు ఎరువులు అందిస్తున్నారా అనే అంశాలను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. అలాగే కల్తీ ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు ప్యాకెట్లపై వివరాలు, నాణ్యత ప్రమాణాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమైన అధికారులు ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. సాగునీటి లభ్యత తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు మొత్తం విస్తీర్ణoలో ఆరుతడి పంటలు సాగు చేయడం శ్రేయస్కరం అని వివరించారు. రైతులు కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జలు మరియు ఇతర చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.       వ్యవసాయ శాఖ అధికారులు రైతులు అధీకృత ఎరువుల దుకాణాల నుంచే ఎరువులు కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఏవైనా అక్రమాలు గమనించిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.     ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి యం. ఋషేంద్రమని, రమేష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) నాగయ్య, మురళి, రైతులు తదితరులు పాల్గొన్నారు.,

 

 

Previous post

రాష్ట్రంలోనే మిర్యాలగూడను ప్రథమ స్థానంలో నిలిపేలా SIR కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

Next post

MLA బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ

You May Have Missed