రాష్ట్రంలోనే మిర్యాలగూడను ప్రథమ స్థానంలో నిలిపేలా SIR కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

రాష్ట్రంలోనే మిర్యాలగూడను ప్రథమ స్థానంలో నిలిపేలా SIR కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

 

ప్రజాలహరి మిర్యాలగూడ; ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం *రాజీవ్ భవన్* లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారి ఆధ్వర్యంలో, డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత గారు l మరియు SIR కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ షబ్బీర్ అలీ గారు సమక్షంలో

మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, వార్డ్ ఇన్‌చార్జ్‌లు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు)తో సమీక్షా సమావేశం నిర్వహించారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, *Special Intensive Revision (SIR)* కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే అత్యంత కీలకమైన ప్రక్రియ అని అన్నారు..అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు కావడంతో పాటు, ఎలాంటి తప్పులు, లోపాలు లేకుండా ఓటరు జాబితాను రూపొందించడంలో పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు SIR కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని,

SIR కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సమన్వయంతో, అంకితభావంతో పనిచేయాలని* పిలుపునిచ్చారు… డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత గారు మరియు నియోజకవర్గ ఇన్‌చార్జ్ షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, పార్టీ శ్రేణులు బూత్ స్థాయి నుంచి సమర్థవంతంగా పనిచేసి నిర్ణీత గడువులోగా SIR కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్రంలో మిర్యాలగూడకు ఆదర్శ స్థానాన్ని తీసుకురావాలని కోరారు…

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ గారు, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ గారు, పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ కౌన్సిలర్లు, వార్డ్ ఇన్‌చార్జ్‌లు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

You May Have Missed