ఒక విద్యార్థి- ఒక టీచర్… ఇది అన్నపురెడ్డి గూడెం ప్రభుత్వ పాఠశాల పరిస్థితి..
ఓకే పంతులు, ఒకే విద్యార్థి.
అన్నపరెడ్డిగూడెం స్కూల్
వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలోని అన్నపురెడ్డిగూడెం గ్రామంలో ఒకే పంతులు ఒకే విద్యార్థితో పాఠశాల నడుపుతున్నారు, ఇట్టి విషయంపై స్థానికులు పై అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికిని ఫలితం లేదని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. . అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థి హాజర్ రిజిస్టర్లు తప్పుడు పేర్లు నమోదు చేసి సంఖ్యను ఎక్కువ చూయించి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బియ్యం కూడా లెక్కలోకి రాకుండా చూపిస్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ యొక్క పాఠశాలపై దృష్టి సారించి ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు, పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని ఆ గ్రామంలోని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇక్కడ పని చేస్తున్నటువంటి పంతులు ఎట్లాగ పిల్లలు లేరని ఉద్దేశంతో ఆయన ఆడింది ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తూ ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తూ ఆయన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాడు. ఇట్టి విషయంపై ప్రభుత్వం ఒకసారి దృష్టి సాధించాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు



