మిర్యాలగూడ నియోజకవర్గంలో SIR నిర్వహణపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించిన మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ 

మిర్యాలగూడ నియోజకవర్గంలో SIR నిర్వహణపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించిన మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

 

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ టౌన్ రెడ్డి కాలనీలోని BRS పార్టీ కార్యాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించిన SIR (Special Intensive Revision) కార్యక్రమ నిర్వహణపై మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ హాజరై పార్టీ నాయకులు, మండల ఇంచార్జ్ లు , వార్డు ఇంచార్జ్ లు, ముఖ్య కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 82.59 శాతం అయినట్లు తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామం, ప్రతి బూత్‌లో జరుగుతున్న ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ రోజు వరకు మాజీ  MLA శ్రీ.నల్లమోతు భాస్కర్ రావు నేతృత్వం లో.. మిర్యాలగూడ నియోజకవర్గం లో పూర్తి అయిన ఓటర్ల మ్యాపింగ్ పై BRS పార్టీ శ్రేణులు చేస్తున్న కృషిని అభినందిస్తూ సంతృప్తిని వ్యక్తం చేసారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అలాగే మండలాల వారీగా SIR కార్యక్రమ పురోగతిని తెలుసుకుని, అవసరమైన సూచనలు చేస్తూ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.      ఈ సమావేశంలో అన్నబీమోజు నాగార్జున చారి, పెద్ది శ్రీనివాస్ గౌడ్, మాలావత్ రవీందర్ నాయక్, నల్లమోతు సాంబశివ రావు, భూక్య రాంబాబు, అరుణ్ కుమార్, గణేష్, కృష్ణా నాయక్, మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, మండల ఇంచార్జ్‌లు, బూత్ స్థాయి నాయకులు, BLAలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

You May Have Missed