మెడిసిన్ లో కె ఎల్ ఎన్ కళాశాల విద్యార్థినిల ప్రభంజనం..
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ కె.ఎల్.ఎన్ కాలేజీలో ఈరోజు వెలువడిన నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లు సాధించారు. జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ మెడిసిన్ ఫలితాలలో మిర్యాలగూడకు చెందిన కే ఎల్ ఎన్ కళాశాల విద్యార్థినీలు అత్యద్భుతమైన ప్రతిభను కనబరిచి ఆదిక్యాన్ని చాటుకున్నారు
కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ డైరెక్టర్స్ టి నరేందర్ రెడ్డి, పి ఎల్ ఎన్ రెడ్డి, టిహనుమంత రెడ్డి
పాల్గొన్నారు
టి హనుమంత రెడ్డి మాట్లాడుతూ అత్యధిక ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉద్దేశించి వారు సాధించిన ఘన విజయం ఎందరికో ఆదర్శం కావాలని కోరారు. ఉత్తమమైన విద్య ను అభ్యసించడం వలన రెండు కోట్ల రూపాయల చెల్లించి చదివే ఎంబిబిఎస్ లో ఉచితంగా పొందే అవకాశం ఉన్నదని అన్నారు విద్యార్థినీలను, తల్లిదండ్రులు కళాశాల అధ్యాపకులు సన్మానించారు తమ పిల్లల ఘన విజయానికి కారకులైన కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.



