పల్లెల్లో గ్యాస్ సిలిండర్ల సమస్యను పునరుద్ధరించాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డిఓ కు వినతి

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఆర్డీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యాదగిరి పల్లి గ్రామంలో మంజీరా గ్యాస్ గోడౌన్ గంగ దేవమ్మ గుడి దగ్గర ఉన్నది, గత సంవత్సరం నుండి వారు తగాదాలు పడి కోర్టులు వేసుకొని అక్కడ ఉన్న 3000 గ్యాస్ కనెక్షన్లు మొత్తం వేములపల్లి మండలం అక్కడ ప్రజలు గ్యాస్ దొరక్క అనేక ఇబ్బందు పడి రోడ్ల మీద పడుచున్నారు.     మళ్లీ ఇప్పుడు మంజీరా గ్యాస్ గోడౌను ప్రారంభించారు ఆ గోడౌన్ లో సుమారు యాదగిరి పల్లి, కాలువ పల్లి, ఆలగడప ఉట్ల పల్లి తక్కెళ్ళపాడు, తడకమళ్ళ 10 గ్రామాలకు సంబంధించినటువంటి మూడు వేల గ్యాస్ కనెక్షన్లను మరల మంజీరా గ్యాస్ కనెక్షన్లకు బదిలీ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నది మంజీరా గ్యాస్ గోడౌనుకు పైన తెలిపిన అన్ని గ్రామాలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మిర్యాలగూడ ఆర్డీవో గారు 3000 గ్యాస్ కనెక్షన్లు మంజీరా గ్యాస్ కంపెనీకి బదిలీ చేయాలని ఈ మంజీరా గోడం ఆఫీసు కూడా ప్రజలందరికీ అందుబాటులో నాగార్జున థియేటర్ దగ్గర ప్రజలకు అందుబాటులో ఉన్నదని ప్రజలై పాత కనెక్షన్లు మాకు యధావిధిగా ఇప్పించగలరని ఆర్డిఓ గారికి మెమోరడం ఇవ్వటం జరిగింది . ఈ కార్యక్రమంలో గువ్వల మట్టయ్య ఎస్కే రహీం దోనేటి వెంకటేశ్వర్లు భాగం శేషయ్య గువ్వల రామకృష్ణ తదితరులు సమర్పించినారు

You May Have Missed