మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR
ప్రజాలహరి మిర్యాలగూడ ; మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR)
రోగులు, బాలింతలతో మాట్లాడి ఆసుపత్రి సేవలపై ఆరా. ఈరోజు మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో జన్మించిన మిర్యాలగూడ పట్టణం 37వ వార్డు కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ మానవరాలిని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR పరామర్శించి, చిన్నారికి ఆశీస్సులు అందజేశారు.. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు… అలాగే ప్రసవించిన బాలింతలను కలిసి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు… ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. అనంతరం డ్యూటీలో ఉన్న వైద్యులతో సమావేశమై ఆసుపత్రిలో రోజువారీ ప్రసవాల సంఖ్య, ఓపీ (OP)కు వచ్చే రోగుల వివరాలు, అందుబాటులో ఉన్న వైద్య సేవలు, మందులు, మౌలిక సదుపాయాలు, అవసరమైన వసతులపై సమగ్రంగా ఆరా తీశారు… ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ప్రతి రోగికి సకాలంలో చికిత్స అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు…ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు… ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ గారు, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..



