వర్షపు నీటి పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

“క్యాచ్ ది రైన్” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR.     ఈరోజు మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో “Catch the Rain – Rain Water Harvesting Campaign”     కార్యక్రమాన్ని  మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి – BLR* గారు,  మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి ప్రారంభించారు…           ఈ సందర్భంగా వర్షపు నీటి సంరక్షణపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రజలకు కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.   అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు కలిసి *వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ, వర్షపు నీటిని వృథా కాకుండా ప్రతి ఇంటిలో **రైన్ వాటర్ హార్వెస్టింగ్** వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో నీటి కొరతను నివారించవచ్చన్నారు. ప్రతి పౌరుడు నీటి సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు…     రైన్ వాటర్ హార్వెస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు:     భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది.   వేసవిలో నీటి కొరతను తగ్గించవచ్చు.  వ్యవసాయానికి నీటి లభ్యత మెరుగుపడుతుంది.  పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది.    భావితరాలకు నీటి వనరులను సంరక్షించవచ్చు.     పౌరులు పాటించాల్సిన సూచనలు:    ఇంటి పైకప్పులను పరిశుభ్రంగా ఉంచాలి.    ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.                 నిల్వ ట్యాంకులను నిర్వహించాలి.   ప్రతి ఇంటిలో రీచార్జ్ పిట్ లేదా రైన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.   ఈ కార్యక్రమం ద్వారా మిర్యాలగూడ మున్సిపాలిటీ పట్టణ ప్రజల్లో వర్షపు నీటి సంరక్షణపై విస్తృత అవగాహన కల్పిస్తూ, “ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుదాం – భవిష్యత్ తరాలకు జల భద్రతను అందిద్దాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది అని అన్నారు..  ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Previous post

కొత్తగూడెం గ్రామంలోని రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో రైతు భరోసా నిధులు విడుదల రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న దృశ్యo ను తిలకిస్తున్న రైతులు

Next post

మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR

You May Have Missed