మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి (MAO) రుషేంద్రమని ఆధ్వర్యంలో రైతు వేదిక గురించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్
ప్రజల హరి మిర్యాలగూడ; -ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా, చింతకాని మండలం నుంచి రైతు భరోసా నిధులు 1009.15 కోట్ల రూపాయలు 1.44 లక్షల రైతులు ఖాతాలోకి విడుదల చేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం (Live) చేయగా, మిర్యాలగూడ మండలం లోని కొత్తగూడెం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి (MAO) రుషేంద్రమని ఆధ్వర్యంలో సుమారు 150 మంది రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రైతు భరోసా పథకం ద్వారా రైతులకు అందిస్తున్న వ్యవసాయ అభివృద్ధి గురించి వివరించారు, ఈ కార్యక్రమం లో కిసాన్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి,AEOs పార్వతి, నాగయ్య , అఫ్రీన్, గోపి ,రైతులు ఇజ్రాయెల్, సురేందర్ రెడ్డి, కోటిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు



