నాగార్జునసాగర్ ముంపు భూమి బాధితులకు న్యాయం చేయాలి
- ప్రజాలహరి మిర్యాలగూడ; నాగార్జునసాగర్ ముంపు భూమి బాధితులకు న్యాయం చేయాలి.. కబ్జాదారుల వల్ల అన్యక్రాంతమవుతున్న సర్వేనెంబర్ 826, 1113, 842, 430 భూములను కాపాడాలని ఎమ్మార్వో కు వినతి.
దామరచర్ల మండల వ్యాప్తంగా భూ బకాసురు ల వల్ల చెరువులు గుట్టలు కుంటలు అసైన్డ్ ఫారెస్ట్ డి ఫారెస్ట్ ఇతర అన్ని రకాల భూములను కబ్జాదారులు కబ్జా చేసుకుని రియల్ ఎస్టేట్ తో అక్రమ వ్యాపారం చేసుకుంటున్నా వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు ఆరోపించారు. దామరచర్ల మండలంలోని రాజగట్టు గ్రామం పంచాయతీకి చెందిన నాగార్జున సాగర్ ముంపు బాధితుల భూములను కాపాడాలని వారికి పట్టాలు ఇవ్వాలని సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు పాల్గొని ఎమ్మార్వో కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల క్రితం సర్వేనెంబర్ 826, 1113 లో పునరావాసం చట్టం కింద రాజగటులో భూములు ఇచ్చారని అన్నారు. ఇట్టి భూములను కొంతమంది సాగు చేసుకుని జీవనం గడుపుతుండగా మరి కొంతమంది భూములను అలాగే ఉంచుకున్నారు. ఇట్టి భూములపై కన్ను వేసిన మండల భూకబ్జాదారులు అక్రమంగా 1970 రికార్డులను తారుమారు చేసి డి ఫామ్ పట్టాలు లేకుండానే ముంపు బాధితుల భూములను అక్రమంగా ఆక్రమించుకొని బాధితులను బెదిరిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి దామరచర్ల మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మండలానికి చెందిన కొంతమంది భూకబ్జాదారులు రాజకీయ అండదండలతో నాగార్జునసాగర్ ముంపు బాధితుల భూములను సర్వేనెంబర్ 826, 1113, 842,430, ఇతర ఫారెస్ట్ భూములు అక్రమంగా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకొని బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా భూములను కబ్జా చేసుకుని రికార్డులను తారుమారు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులకు నిజమైన లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ సీనియర్ కామ్రేడ్స్ భూ బాధితులు గజ్జల లక్ష్మీ నరసింహ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జమ్ముల కోటయ్య భాగం శేషయ్య తావూరియా సైదా తదితరులు పాల్గొన్నారు.



