గోదావరి పుష్కరాలు సుముహూర్తం ఖరారు

*గోదావరి పుష్కరాలకు ముహూర్తం అధికారికంగా ఖరారు*

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్

పవిత్ర గోదావరి నదీ పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 2027 జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకూ 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు గోదావరి పుష్కరాల ప్రారంభ తేదీలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి పుష్కరాల తేదీలు, ముహూర్తం గురించి టీటీడీ ఆస్థాన సిద్ధాంతి, ఆగమ, వైదిక పండితులు ఏపీ దేవాదాయశాఖ కమిషనర్‌కు ఇటీవలే వివరాలు అందించారు. వీటిని పరిశీలించిన అనంతరం గోదావరి పుష్కరాల తేదీలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి వర్యులు ఆనం రామనారాయణరెడ్డి త్వరలోనే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

You May Have Missed