*మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు*
ప్రజాలహరి క్రైమ్జూ మిర్యాలగూడ న్ 26 మిర్యాలగూడ పట్టణ పరిధిలోని సబ్ జైల్ రోడ్, విద్యానగర్ నందు నూతనంగా నిర్మించిన *శ్రీ మహాలక్ష్మి అమ్మవారి* దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవాల శుక్రవారం అంతే ఇది న్యూస్రోజు ) ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మశ్రీ మలపాక నాగరాజు శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీశైల వేద పాఠశాల అధ్యాపకులు, ఆలయ పూజారి శ్రీ స్వయంపాకుల భద్రయ్య శర్మ గారి పర్యవేక్షణలో గణపతి పూజ, స్వస్తిపుణ్యాహవాచనము, మాతృకాపూజ, ఋత్విగ్వరణము కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గోమాత సమేతంగా యాగాశాల ప్రవేశం, దేవతాహ్వాన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. సాయంత్రం 5:00 గంటల నుండి జలాధివాసము, మంటపపూజలు, నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు
ఈ ప్రతిష్టాపన మహోత్సవ పూజా కార్యక్రమాల్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన గౌరవ అధ్యక్షులు,17 వ వార్డు కౌన్సిలర్ శ్రీ *నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి* మరియుస్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఈ రోజు నుండి ఈ నెల 29వ తేదీ (సోమవారం) వరకు ఐదు రోజుల పాటు ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
రానున్న రోజుల కార్యక్రమాల వివరాలు:
జూన్ 26 (శుక్రవారం): ఉదయం చండీహోమము, సాయంత్రం దేవతాపూజలు, రాత్రి 7:00 గంటలకు బ్రహ్మశ్రీ ముప్పవరపు సింహాచలశాస్త్రి గారిచే “హరికథా కాలక్షేపం”.
జూన్ 27 (శనివారం): ఉదయం శ్రీమహాలక్ష్మి హవనం (హోమము), రాత్రి 7:00 గంటలకు బ్రహ్మశ్రీ డా॥ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే ఆధ్యాత్మిక ప్రవచనము.
జూన్ 28 (ఆదివారం): ఉదయం సుదర్శన హోమము, సాయంత్రం పుష్పాధివాసము, శయ్యాధివాస పూజలు.
జూన్ 29 (సోమవారం): ఉదయం 8:31 నిమిషాలకు మూలా నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ, గణపతి, సుబ్రహ్మణ్య, నవగ్రహ స్థిరప్రతిష్టాపన జరుగును. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటల నుండి మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.
కావున పట్టణంలోని భక్తులందరూ ఈ ఐదు రోజుల పాటు జరిగే హోమాల్లో, ప్రతిష్టాపన మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.