ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు ఎమ్మెల్యే బి ఎల్ ఆర్

ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజు నిర్వహించిన విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR మరియు కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసి, వారి విద్యాభ్యాసానికి శుభాకాంక్షలు తెలియజేశారు…అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్యేనని ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో, అంకితభావంతో చదువుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు… తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేర్చేలా కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు…రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు… విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో MEO ధర్మా నాయక్ , కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…

You May Have Missed