తెలంగాణ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లకు మరియు కో ఆప్షన్ సభ్యులకు ఒక రోజు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం

ప్రజాలహరి హాలియా;నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ పట్టణ అభివృద్ధి శాఖ (NIUM & ESCI) తెలంగాణ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లకు మరియు కో ఆప్షన్ సభ్యులకు ఒక రోజు ఓరియంటేషన్ శిక్షణా ప్రోగ్రాం హైదరాబాదులోని గచ్చిబౌలి నందు ఉన్న సెంచరీ కన్వెన్షన్ సెంటర్ నందు ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాలియా పురపాలక వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు హాజరవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు , రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పట్టణ ప్రణాళిక విభాగం మరియు నాయకత్వ వికాసము గురించి మున్సిపల్ వైస్ చైర్మన్ లకు కౌన్సిలర్లకు కోఆప్షన్ సభ్యులకు పై అంశాల గురించి వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్, 2 వ వార్డు కౌన్సిలర్ నకిరెకంటి అన్నపూర్ణ సైదులు, 3 వ వార్డు కౌన్సిలర్ కుందూరు వెంకటరెడ్డి,4 వ వార్డు కౌన్సిలర్ కడమంచి ప్రమీల శ్రీను ,5 వ వార్డు కౌన్సిలర్ చిట్టిపోలు శ్రీదేవి కర్ణసాగర్, 6 వ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసురాజు,8 వ వార్డు కౌన్సిలర్ గౌహర్ జబీన్ మజార్ ,9 వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు, 10 వ వార్డు కౌన్సిలర్ పిల్లి చంద్రకళ ఆంజనేయులు,11 వ వార్డు కౌన్సిలర్ దీపావత్ ప్రసాద్, 12 వ వార్డు కౌన్సిలర్ ఎడవల్లి మేరి రంజిత్ , కో ఆప్షన్ సభ్యులు కొమ్మనబోయిన జయమ్మ, చెన్ను రాజేశ్వరి, వర్కాల శేఖర్ రెడ్డి, ఎండి రషీద్ , మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంట్ కె. సైదులు గార్లు పాల్గొన్నారు .ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శ్రీదేవి , NIUM డైరెక్టర్ , డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ , మున్సిపల్ శాఖ జాయింట్ డైరెక్టర్లు డిప్యూటీ డైరెక్టర్లు మరియు పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు పాల్గొనడం జరిగింది.

You May Have Missed