వివాహిత మహిళ అదృశ్యం
ప్రజాలహరి మిర్యాలగూడ;తేది:12.07.2026 రోజు 09.00 గంటల తరువాత అన్నారం గ్రామస్థురాలు అగు కిలారీ అనిత భర్త: జానకి రాములు 33 సం.లు, యాదవ అను మహిళా ఇంటి వద్ద నుండి చెప్పకుండా ఎటో వెళ్ళి పోయి తిరిగి రాకుండా, 13.07.2026 ఉదయం 11.00 గంటలకు తన కొడుకు శివ సాయి చదువుతున్న బొప్పారం గ్రామం కేతేపల్లి మండలం గురుకుల పాఠశాల కు వెళ్ళి అక్కడ నుండి విజయవాడ వెళ్తున్నాను అని వెళ్ళి పోయి తిరిగి ఇంటికి b. ఆన్నారం రాకుండా మరియు తల్లి గారి ఇంటికి మర్రిగూడం గ్రామం త్రిపురారం మండలం కు వెళ్ళకుండా ఎటో వెళ్ళి పోయి తప్పిపోయినది. అప్పటి నుండి తప్పిపోయిన మహిళ గురించి చుట్టుప్రక్కల ప్రదేశాలు, భంధువుల ఇండ్ల వద్ద మొత్తం వెతికి వచ్చినా కాని ఆమె జాడ తెలియలేదు. మహిళా ఎత్తు సుమారు 5’ మరియు నలుపు రంగు తో పాటు పంజాబీ డ్రస్ ధరించి వున్నది. ఆమె భర్త కిలారి జానకి రాములు ఈరోజు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి ముమ్మరముగా వెతుకుచూ దర్యాప్తు లో కలదు. ఆమె గురించి ఆచూకీ తెలిసిన వారు భర్త..9347838070,8712670189 SI మిర్యాలగూడ రూరల్, 87126715151 CI మిర్యాలగూడ రూరల్ సర్కిల్ లకు సమాచారం ఇవ్వగలరు.



