TRSMA ఫేజ్-2 మిర్యాలగూడ పట్టణ కమిటీ ఎన్నిక: అధ్యక్షుడిగా మూడోసారి కందుల మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

ప్రజాలహరి – మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ): మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ విద్యోదయ గోల్డెన్ కిడ్స్ పాఠశాలలో సోమవారం ఉదయం 11 గంటలకు TRSMA ఫేజ్-2 ప్రైవేట్ పాఠశాలల పట్టణ కమిటీ ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికలు TRSMA స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ శ్రీరామ కవచం నాగరాజ్ ఆధ్వర్యంలో జరిగాయి.

ఈ ఎన్నికల్లో మిర్యాలగూడ పట్టణ TRSMA ఫేజ్-2 అధ్యక్షుడిగా కందుల మధుసూదన్ రెడ్డి (రవీంద్ర భారతి హైస్కూల్) మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

– జనరల్ సెక్రటరీగా: సోమగాని శ్రీనివాస్ (శ్రీ వాగ్దేవి హైస్కూల్)

– ట్రెజరర్ గా: దోనాల రాంరెడ్డి (శ్రీ విద్యోదయ గోల్డెన్ కిడ్స్)

– ఉపాధ్యక్షులుగా: గుర్రం శ్రీనివాస్ (లిటిల్ రాకెట్స్ స్కూల్)

– జాయింట్ సెక్రటరీగా: సోముల సార్ (మిర్యాలగూడ హైస్కూల్)

– ఆర్గనైజర్ సెక్రటరీగా: సి.హెచ్. రాంబాబు (లిటిల్ హార్ట్స్ స్కూల్)

– లేడీ రిప్రజెంటేటివ్ గా: మిస్ ప్రిన్సెస్ (కార్నర్ స్టోన్ స్కూల్)

– ఈసీ మెంబర్ గా: జమీల్ (S.R. Digi School) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

ఎస్వీఆర్ స్కూల్ అయ్యన్న, కైరాలి స్కూల్ అహ్మద్, గోల్కొండ హైస్కూల్ ఉపేందర్, ఢిల్లీ వరల్డ్ స్కూల్ చంద్రశేఖర్, ఆక్స్ ఫర్డ్ స్కూల్ అశోక్, ఆచార్య IIT అకాడమీ డైరెక్టర్ వినోబిరెడ్డి, A.S.R ధ్రోణ సతీష్, మౌంట్ కార్మెల్ హైస్కూల్ వెంకటేష్, సెయింట్ థామస్ మార్టిన్ మాథ్యూ, ఎస్పీఆర్ దామరచర్ల స్కూల్ సీనయ్య, జయ హైస్కూల్ శేఖర్, సారా హైస్కూల్ వేములపల్లి మునీర్, జెన్స్ ప్లే స్కూల్ హౌసింగ్ బోర్డు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..

Previous post

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR పిలుపు

Next post

కరీంనగర్ బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ వేశం

You May Have Missed