ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారిణి ఎం ఋష్యేంద్రమణి
ప్రజాలహరి మిర్యాలగూడ:- మిర్యాలగూడ మండల వ్యవసాయాధికారి ఎం.ఋష్యేంద్రమణి సోమవారం స్థానిక ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. విక్రయాల్లో మోసాలు జరగకుండా రికార్డులు, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి ఎరువుల నమూనాలు సేకరించారు. ఎరువుల నమూనాలను సేకరించినట్టు తెలిపారు. తనిఖీలు సాయి మహేశ్వర ఫర్టిలైజర్స్, సిద్ధి వినాయక ఫర్టిలైజర్స్ లలో నిర్వహించి ఎరువుల శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపించడం జరిగినదని తెలిపారు. తనిఖీల్లో ఎరువుల డీలర్లు తెడ్ల జవహర్ బాబు, బిక్షం, శ్రీనివాస్ ఉన్నారు



