పడకేసిన పారిశుధ్యం పట్టించుకోని అధికారులు

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్;

మిర్యాలగూడ నడిబొడ్డున పడకేసిన పారిశుధ్యం

కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తున్న మిర్యాలగూడ నడిబొడ్డు అంబేద్కర్ సర్కిల్ వాసవి భవన్ రోడ్డులో గత మూడు రోజుల క్రితం కురిసిన చిన్నపాటి వర్షానికి పొంగిపొర్లుతున్న నాలాల్లో భాగంగా వాసవిభవన్ రోడ్ లో ఉన్న మెయిన్ రోడ్డుకు కలిపిన లింకు నాలా రోడ్డు మీదుగా ప్రవహిస్తుంటే పాదచారులు వాహనదారులు ఆ దారిలో వెళ్లాలంటే అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా పట్టణ పారిశుద్ధ్య సిబ్బంది అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప పట్టించుకున్న నాథుడు లేకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది మరియు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది మురుగునీరు ప్రవహిస్తున్న దారిలో పాదజారులు చూస్తూ చూస్తూ వెళ్లలేకపోవుచున్నారు ఈ పరిస్థితి గత నాలుగు రోజుల నుండి అలాగే ఉండడం వల్ల దుర్గంధం వెదజల్లుతుంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని నాలాను సరి చేయించవలసిందిగా పలువురు కోరుచున్నారు.

You May Have Missed