గుర్తుతెలియని వాహనం ఢీ వ్యక్తి మృతి

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్

గుర్తు తెలియని వాహనం ఢీ వ్యక్తి మృతి

మిర్యాలగూడ మండలం ఈ గురువారం రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన వికాస్ కుమార్ రిషి దేవ్ (21) మృతి చెందాడు సహ కార్మికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు

మృతుడు బిహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా హమాలీ కార్మికుడిగా జీవనం గడుపుతూ తన సహచరులతో పని ముగించుకొని రహదారిని దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మరణించాడని చుట్టు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఓటేజీలను పరిశీలించి కావలసిన ఆధారాలను సేకరించి ప్రమాదానికి కారణమైన లారీను గుర్తించి స్వాధీన పరుచుకున్నారని మరియు లారీ డ్రైవర్ హుజూర్నగర్ మండలం మల్లన్న నగర్ వాసి మల్లి కేశ్వరరావు(27) తండ్రి శ్రీను ను అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం విచారణ జరుగుతున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు

You May Have Missed