స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం
ప్రజాలహరి మిర్యాలగూడ: భారత ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛతా హీ సేవా 2026’ (Swachhata Hi Seva 2026) కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, సఫాయి మిత్రుల ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని కాపాడే లక్ష్యంతో ‘సఫాయిమిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శివిర్’ (Safaimitra Suraksha Evam Samman Shivir) పేరుతో ప్రత్యేక ఉచిత హెల్త్ క్యాంప్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా RDO రమణ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధ – బాలకృష్ణ,వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష – నవీన్ కుమార్ గారు, మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి హాజరయ్యారు.ఈ వైద్య శిబిరంలో పారిశుధ్య కార్మికులకు, పురపాలక సిబ్బందికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సలహాలు మరియు వైద్య సేవలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న సఫాయి మిత్రుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు, BLR బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు.



