జాతీయ పితామహుడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ);మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మరియు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన మహాత్మా గాంధీ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుదాం అని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సుధా బాలకృష్ణ వ్యాఖ్యానించారు.



