ప్లాస్టిక్ వినియోగంపై హాలియా మున్సిపల్ అధికారులు రైడింగ్
ప్రజాలహరి హాలియా;మున్సిపల్ కమిషనర్ కే. రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు హాలియా పురపాలక సంఘ పరిధిలో ప్లాస్టిక్ డిస్పోజబుల్స్, ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై మున్సిపల్ అధికారులు రైడింగ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా అధికారులు వ్యాపారులు, ప్రజలకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి ప్లాస్టిక్ రహిత హాలియా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జూట్, బట్ట సంచులు వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రజలు సహకరించవలసిందిగా కోరారు.మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ప్లాస్టిక్ వినియోగంపై నిబంధనలను అమలు చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పర్యావరణ ఇంజనీర్ రవికుమార్, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ఖలీల్, మున్సిపల్ జవాన్లు అశోక్, వెంకటయ్య, శ్రీను మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



