మురుగునీరుతో దుర్గంధం వెదజల్లుతున్న దారులు
ప్రజాలహరి మిర్యాలగూడ; (హరి ప్రసాద్ చీదళ్ళ); అధికార ప్రతిపక్ష నాయకులు మీకు ప్రతినిత్యం లక్షలాది ప్రజలు వాహనదారులు మరియు పాదచారులు అయ్యుండి నిత్యం రద్దీగా ఉండే ప్రదేశమైన అంబేద్కర్ విగ్రహం నుండి వాసవి భవన్ వెళ్లే దారి గత వారం రోజులుగా మురుగునీరు చిమ్ముతూ దుర్గంధం వెదజల్లుతుంటే, తమరికి ఈ చిత్రం కనిపించుట లేదా ఇంకా ఎన్నాళ్ళు ఈ దుర్గంధం భరించవలె అని మిర్యాలగూడ మరియు పరిసర ప్రాంత ప్రజలు పత్రిక ముఖంగా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రదేశంలో ఏ ప్రజా నాయకుడైన మునిసిపల్ ప్రతినిధులైన పది నిమిషాలు నిలకడగా ముక్కు మూసుకోకుండా నిలబడగలరా అని ప్రజలు సంబంధిత అధికారులను పత్రికా ముఖంగా ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించగలరు అని ప్రజలు తమ ఆవేదనను వెళ్ళగక్కుతున్నారు.



