కేంద్రీయ విద్యాలయ PETపై చర్యలు తీసుకోవాలి: ABVP
మిర్యాలగూడ ;మిర్యాలగూడలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన PET సతీష్‌పై సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నల్గొండ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫార్మా విజన్ స్టేట్ కో కన్వీనర్ శివ, స్టేట్ యూనివర్సిటీ కో కన్వీనర్ మౌనేశ్వర్ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్టల శంకర్, నల్గొండ నగర ఎస్ ఎఫ్ డి కన్వీనర్ ములుగురు శివ, పరమేష్, లక్ష్మీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు



