50% పిట్ మెంట్ తో పిఆర్సి ప్రకటించాలి:- దశరథ్ నాయక్
ప్రజాలహరి మిర్యాలగూడ;50% పిట్ మెంట్ తో రెండవ పిఆర్సినీ సోమవారం జరగనున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ సమావేశంలో ప్రకటించి వచ్చే నెల అక్టోబర్ నుంచి అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం మిర్యాలగూడలో జరిగిన బంజారా ఉద్యోగుల సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు.2023జూలై నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ ఇప్పటికే ఆలస్యం అయిందని అన్నారు.తక్షణం మూడు డీఏ లు ప్రకటించాలని కోరారు.ఉద్యోగ,ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ వివక్ష తగదని వారికి ఇవ్వాల్సిన వాటిని వెంటనే ఇవ్వాలని కోరారు.చర్చల పేరుతో కాలయాపన చేయడం సహించరాని విషయమని ఇప్పటికే మూడేండ్లలో ఉద్యోగ,ఉపాధ్యాయులు తీవ్ర నష్టాన్ని చవిచూశారని తెలిపారు. కాలయాపన చేస్తే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చూసి సహించబోవని, ఉద్యోగులు తీవ్ర అగ్రహంతో ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించి వెంటనే ప్రకటనతో పాటు పిఏసిని అమలు చేసేందుకు తక్షణం ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు జామ్ల నయా, మక్లా నాయక్, సైదా నాయక్, శీను నాయక్, మోతిలాల్,రమేష్ నాయక్, నానిక్యా నాయక్,శంకర్ నాయక్, సైదానాయక్, తదితరులు పాల్గొన్నారు.



