కొండా లక్ష్మణ్ బాపూజీకి మిర్యాలగూడలో ఘనమైన నివాళులు
ప్రజాలహరి మిర్యాలగూడ;ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14 వర్ధంతి సందర్బంగా బీజేపీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలో సాగర్ రోడ్ లో వారి విగ్రహానికి పూల మాలతో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా బీజేపీ 1వ పట్టణ అధ్యక్షులు బంటు గిరి మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ, స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోని, వారి చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిలుకూరి శ్యామ్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కొంగరి వెంకటరమణ, ఉపాధ్యక్షులు చిలుకూరి వెంకటేశ్వర్లు, పున్న రాములు, జిల్లా శ్రీనివాస్ లు పాల్గొన్నారు.



