మిర్యాలగూడ నియోజకవర్గ వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేతిప్పన విజయసింహ రెడ్డి , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ 

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణంలోని 6, 7, 17, 18, 21వ వార్డులతో పాటు వేములపల్లి గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన ప్రసాద కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు ఈ సందర్భంగా నల్లమోతు సిద్ధార్థ మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలు ప్రజలలో భక్తి, ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో ఏడవెల్లి శ్రీనివాస్ రెడ్డి,అన్నబీమోజు నాగార్జున చారి,సందేశీ అంజన్ రాజు,వింజం శ్రీధర్,చిర్ర మల్లయ్య యాదవ్,పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్,ఎండి. షోయబ్,బల్లెం అయోధ్య,భూక్యా రాంబాబు,వల్లపట్ల వినోద్,గంట శ్రావణ్ రెడ్డి,పుట్టాల సందీప్, వంగాల నిరంజనరెడ్డి,జావీద్, నాగవేల్లి యాదగిరి,తుమ్మల ఫణి కుమార్,యాదగిరి,వల్లెపు రామస్వామి,కొర్ర కృష్ణా కాంత్,రమావత్ వినోద్ నాయక్,జిన్నా శ్రీనివాస్ రెడ్డి, రాకేష్,శ్రీనాద్,గుడుగు౦ట్ల మధు,శివ, ఫయాజ్,వంశీ,నాగేశ్వర రావు,ఆయా వార్డుల నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You May Have Missed