70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
ప్రజాలహరి మిర్యాలగూడ:మిర్యాలగూడ మండలం తుంగపాడు ZPHS పాఠశాలలో నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) మిర్యాలగూడ నియోజకవర్గం స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.వివిధ క్రీడా విభాగాల్లో విజయం సాధించిన విజేతలకు బహుమతులు, పతకాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విజేతలతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..



