తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ.. MLA -BLR
ప్రజాలహరి మిర్యాలగూడ;తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని RDO కార్యాలయం మరియు మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR , RDO రమణా రెడ్డి , మరియు మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధాబాలకృష్ణ , జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, త్యాగాల ఫలితంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకున్నారు.ప్రజలకు మరింత మెరుగైన పాలన, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.ప్రజా సమస్యలను అధికారులు సమర్థవంతంగా పరిష్కరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…



