అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి ఎమ్మెల్యే బత్తుల

వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని వేములపల్లి మండల కేంద్రంలో గురువారం స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన మండల పరిషత్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను ప్రజలకు కల్పించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో నీటిని వృధా చేయకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా వ్యవహరించే విధంగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఆయన కోరారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలను ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు తీసుకొని తమ ఇండ్లలో వాడుకున్న నీరును ఇంకుడు గుంతలకి పోయే విధంగా ప్రతి ఒక్కరు చూసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి వికసిత భారత్ ద్వారా సన్నకారు రైతులకు చాపల పెంపకం ఏర్పాటు చేసుకొని అభివృద్ధి లోకి రావాలని ఆయన సూచించారు. ఇట్టి పెంపకానికి గాను ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఇంచార్జ్ ఎంపీడీవో జ్యోతి, మండల తాసిల్దార్ హేమలత, మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్, వేములపల్లి గ్రామ సర్పంచ్ పుట్టల సందీప్, ఆమనగల్లు గ్రామ సర్పంచ్ సందీప్, వేములపల్లి పిఎసిఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్ వివిధ గ్రామాల సర్పంచులు, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

You May Have Missed