14వ మైలు చెక్‌పోస్ట్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలన చేసిన నల్లగొండ జిల్లా కలెక్టర్

ప్రజాలహరి;హాలియా:అనుముల మండలం పరిధిలోని 14వ మైలు చెక్‌పోస్ట్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను నల్లగొండ జిల్లా కలెక్టర్ నేడు పర్యవేక్షించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇతర అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు ఆదేశించారు.గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా మరియు పరిశుభ్రమైన వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇట్టి పర్యవేక్షణలో R.D.O,,D S P ,C I ,M R O , హాలియా మున్సిపాలిటీ చైర్మన్ , కమిషనర్ , హాలియా S I ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్, మరియు ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొనడం జరిగింది.

You May Have Missed