విద్యార్థులు, యువత సమస్యలను పరిష్కరించాలి – ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి.మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు .

ప్రజాలహరి మిర్యాలగూడ: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా BRS పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు నాయకత్వంలో విద్యార్థులు, యువత సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలోని రెడ్డి కాలనీలో గల BRS పార్టీ కార్యాలయంలో విద్యార్థులు, యువతతో సమావేశం నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నాయకులు విమర్శించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని, యూత్ డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం BRS పార్టీ కార్యాలయం నుంచి భారీగా బైక్ ర్యాలీగా బయలుదేరి గాంధీ బొమ్మ, బస్టాండ్ మీదుగా రౌండ్ వరకు యువత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై నినాదాలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే BRS పార్టీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BRS యువనాయకులు నల్లమోతు సిద్ధార్ధ,ఎండి.యూసుఫ్, ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి,ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, ఎండి.ఇలియాస్ ఖాన్,అంగోతు హతిరాం నాయక్, కుందూరు వీరకోటి రెడ్డి, ఎండి.మగ్దుంపాషా,ఎండి.మాజీద్,BRSV రాష్ట్ర కార్యదర్శి ఎండి.షోయబ్, యర్రమళ్ళ దినేష్, PCK ప్రసాద్, BRS పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు*.

You May Have Missed